వృద్ధుడిని ఢీకొట్టి... ఆపకుండా వెళ్లిన ఎమ్మెల్సీ ఇక్బాల్ వాహనం
ABN , First Publish Date - 2021-12-31T19:58:46+05:30 IST
ఎమ్మెల్సీ ఇక్బాల్ అహమ్మద్ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొన్న ఘటన జిల్లాలోని లేపాక్షిలో చోటు చేసుకుంది.

అనంతపురం: ఎమ్మెల్సీ ఇక్బాల్ అహమ్మద్ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొన్న ఘటన జిల్లాలోని లేపాక్షిలో చోటు చేసుకుంది. వృద్ధుడిని ఢీకొన్నప్పటికీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఎమ్మెల్సీ ఇక్బాల్ వాహనాన్ని చుట్టుముట్టారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ వాహనం హిందూపురం నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.