హిందూపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన
ABN , First Publish Date - 2021-10-25T15:31:08+05:30 IST
హిందూపురం నుంచి రైల్వే సీజనల్ పాసులు అనుమతించడం లేదంటూ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

అనంతపురం: హిందూపురం నుంచి రైల్వే సీజనల్ పాసులు అనుమతించడం లేదంటూ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కాచిగూడ యలహంక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయాణికులు నిలిపివేశారు. దాదాపు గంటసేపటి నుంచి హిందూపురం రైల్వే స్టేషన్‌లో కాచిగూడ టు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగిపోయింది.