ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలును బహిర్గతం చేయాలి: ప్రభాకర్ చౌదరి

ABN , First Publish Date - 2021-05-02T19:50:26+05:30 IST

కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అన్నారు.

ఆక్సిజన్ సిలిండర్ల కొనుగోలును బహిర్గతం చేయాలి: ప్రభాకర్ చౌదరి

అనంతపురం: కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వేయడానికి లేదంటూ ఉత్తర్వులిచ్చారని... దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని కొనుగోలు చేస్తున్నారు.. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లోపబూయిష్ట చర్యల వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలన్నారు. రెమిడిసివర్ ఇంజక్షన్ కేవలం అనుకూలంగా ఉన్న నర్సింగ్ హోమ్‌లకు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. జిల్లాలో కరోనాను కట్టడి చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రత్యేక దృష్టి సారించి సమీక్షించాలని ప్రభాకర్‌ చౌదరి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-02T19:50:26+05:30 IST