అనంతపురం జిల్లా: నేలపాలైన వేల లీటర్ల పాలు..

ABN , First Publish Date - 2021-08-27T22:26:56+05:30 IST

అనంతపురం జిల్లా: చిన్నారులు, గర్భిణీలకు ఇవ్వాల్సిన పాల ప్యాకెట్లు వృధా అవుతున్నాయి.

అనంతపురం జిల్లా: నేలపాలైన వేల లీటర్ల పాలు..

అనంతపురం జిల్లా: చిన్నారులు, గర్భిణీలకు ఇవ్వాల్సిన పాల ప్యాకెట్లు వృధా అవుతున్నాయి. ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్లపై పారేయాల్సి వస్తోంది. మడకశిర గోడౌన్‌లో వేల లీటర్ల పాలు పాడైపోతున్నాయి. చిన్నారులకు, గర్భిణీలకు సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిండంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. మూడు నెలల లోపు ఈ పాల ప్యాకెట్లను చిన్నారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ సకాలంలో ఇవ్వకపోవడంతో పాల నుంచి దుర్వాసన వస్తోంది. విలువైన ఈ పాల ప్యాకెట్లను చివరికి ఇలా నేలపాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించామని స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి విజయ కుమారి చెబుతున్నారు. పాడైపోయిన పాలకు కాంట్రాక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకు సంబంధించి ఎటువంటి బిల్లులు చెల్లించబోమని చెప్పారు.


Updated Date - 2021-08-27T22:26:56+05:30 IST