Ananta: చెల్లించని బిల్లులు.. ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్

ABN , First Publish Date - 2021-12-30T17:26:22+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా పవర్ కట్ అవుతుండటంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Ananta: చెల్లించని బిల్లులు.. ప్రభుత్వ కార్యాలయాలకు పవర్ కట్

అనంతపురం: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా పవర్ కట్ అవుతుండటంతో ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్న పుట్టపర్తి నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. నేడు అనంతలో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. రెండు సర్వీసుల కింద రూ.3.86 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఒకట్రెండు సార్లు సరఫరా నిలిపివేసినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చిందని  అధికారులు చెబుతున్నారు. పవర్ కట్‌తో అంధకారంలోనే డీఈఓ కార్యాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2021-12-30T17:26:22+05:30 IST