అనంతలో కొత్తచెరువు తహసిల్దార్ మాయాజాలం

ABN , First Publish Date - 2021-06-10T18:39:59+05:30 IST

అనంతలో కొత్తచెరువు తహసిల్దార్ మాయాజాలం ప్రదర్శించాడు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా పంపకాలు జరిపాడు.

అనంతలో కొత్తచెరువు తహసిల్దార్ మాయాజాలం

అనంతపురం: అనంతలో కొత్తచెరువు తహసిల్దార్ మాయాజాలం ప్రదర్శించాడు.  కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా పంపకాలు జరిపాడు. ఆరు నెలల్లో కోట్లు విలువ చేసే 25 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫట్ అయ్యింది. కిందిస్థాయి సిబ్బంది ప్రమేయం లేకుండానే వన్‌బీ, పాస్ పుస్తకాలు మంజూరు అయ్యాయి. మరికొన్ని సర్వే నెంబర్లలో ఒకరికి అసైన్మెంట్ ఇచ్చి సంబంధంలేని వారి పేరున వెబ్ లాండ్‌లో నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో  కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది మూకుమ్మడి సెలవులోకి వెళ్లిపోయారు. మరోవైపు కొత్త చెరవు తహసిల్దార్ మరో 20 రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. 

Updated Date - 2021-06-10T18:39:59+05:30 IST