అ‘పూర్వ’ కలయిక
ABN , First Publish Date - 2021-10-25T06:31:44+05:30 IST
మండలంలోని తగరకుంట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2000 -01 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులం దరూ ఆదివారం పాఠశాలలో కలిశారు.

కనగానపల్లి, అక్టోబరు24: మండలంలోని తగరకుంట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2000 -01 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థులం దరూ ఆదివారం పాఠశాలలో కలిశారు. ఈ సందరర్భంగా ఒకరినొకరు పలకరించుకుని, అప్పటి జ్ఞాపకలను గుర్తు చేసుకుని సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఈ సమావేశానికి అప్పటి తెలుగు ఉపాధ్యాయుడు దేవాదానం హాజరై తన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు.