అల్లుడి దాడి : అత్త మృతి

ABN , First Publish Date - 2021-02-08T06:08:14+05:30 IST

కూ తురిని కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి చేయడంతో అత్త ముద్దీరమ్మ(46) మృతి చెందింది.

అల్లుడి దాడి : అత్త మృతి
ముద్దీరమ్మ మృతదేహంరొళ్ల, ఫిబ్రవరి 7: కూ తురిని కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి చేయడంతో అత్త ముద్దీరమ్మ(46) మృతి చెందింది. ఎస్‌ఐ మక్బూల్‌బాష అం దించిన వివరాల మేరకు ఇలా ఉన్నాయి. రొళ్ల మండ లం హొట్టేబెట్ట గ్రామానికి చెందిన ముద్దీరమ్మ తన కుమార్తెను తమిళనాడు ప్రాంతానికి చెందిన నటరాజ్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించింది. ఇటీవల ఆమె పుట్టింటికి వచ్చిందని నటరాజ్‌ తన భార్యను కాపురానికి పంపాలని ఈనెల 6వతేదీన హొట్టేబెట్ట గ్రామానికి వచ్చి అత్త ముద్దీరమ్మ వద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలో అల్లుడు నటరాజ్‌ అత్త ముద్దీరమ్మను కర్ర తీసుకొని బలంగా తలపై కొట్టాడు. దీంతో స్థానికులు ఆమెను మడకశిర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  అక్క డ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-02-08T06:08:14+05:30 IST