భూముల కేటాయింపు

ABN , First Publish Date - 2021-10-29T05:46:56+05:30 IST

జిల్లాలోని పెనుకొండ, రాప్తాడు మండలంలోని బొమ్మేపర్తిలో వేద, సంస్కృత పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు భూముల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భూముల కేటాయింపు

అనంతపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పెనుకొండ, రాప్తాడు మండలంలోని బొమ్మేపర్తిలో వేద, సంస్కృత పాఠశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు భూముల కేటాయింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని పెనుకొండలో ఇస్కాన చారిటీస్‌ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమిని కేటాయించారు. రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామంలో 17.49 ఎకరాలను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ భూముల్లో వేద, సంస్కృత పాఠశాలలను ఏర్పాటు చేసే బాధ్యతను జయలక్ష్మి నరసింహశాస్ర్తి, గుండ్లూరు ట్రస్టుకు అప్పగించారు. వివిధ పథకాలకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక, వారికి పథకాల మంజూరుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇళ్లపట్టాలు, వైఎస్సాఆర్‌ ఆరోగ్యశ్రీ, రేషన, పింఛన కార్డులపై ఏడాది పొడవునా దరఖాస్తులు స్వీరించేందుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాలు 90 రోజుల్లో, ఆరోగ్యశ్రీ, రేషన, పింఛన కార్డులకు 21 రోజుల్లో వెరిఫికేషన చేసి, అర్హులను ప్రకటించనున్నారు. 

Updated Date - 2021-10-29T05:46:56+05:30 IST