తిమ్మమ్మ మర్రిమానును సందర్శించిన అలహాబాద్ హైకోర్టు జడ్జి
ABN , First Publish Date - 2021-10-20T06:03:45+05:30 IST
మండలంలోని గూటిబైలులో తిమ్మమ్మ మర్రిమానును అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్‌సింగ్ మంగళవారం సం దర్శించారు.

నంబులపూలకుంట, అక్టోబరు 19 : మండలంలోని గూటిబైలులో తిమ్మమ్మ మర్రిమానును అలహాబాదు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక్‌సింగ్ మంగళవారం సం దర్శించారు. ఆల యం వద్ద ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పూజారులు ఘనస్వాగతం పలికారు. తిమ్మమాంబ, బాలవీరయ్యలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిమ్మమాంబ ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వారికి తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను, తిమ్మమాంబ జీవిత చరిత్రను గైడు అనీల్ వివరించారు. స్థానిక ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాటు చేశారు