దళారులను నమ్మి మోసపోవద్దు

ABN , First Publish Date - 2021-12-31T05:29:55+05:30 IST

దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దనీ, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడతామని ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత తెలిపారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు

ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన 

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 30: దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దనీ, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడతామని ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత తెలిపారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్‌ సహకారభవనలో ఏడీసీసీ బ్యాంకు పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత, సీఈఓ ఏబీ రాంప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా అన్ని వర్గాలకు అనుగుణంగా మార్టిగేజ్‌ రుణాలు చెల్లిస్తామన్నారు. ఎస్‌ఓడీ రుణాలు బ్యాంకులో రూ.40లక్షల వరకు, సొసైటీల్లో రూ.10లక్షల వరకు పరిమితిగా నిర్ణయించామన్నారు. పంటరుణాల పరిమితిని రూ.8లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచామన్నారు. పాడిపరిశ్రమకు రూ.3లక్షల వరకు రుణాలిస్తామన్నారు. కంప్యూటరీకరణలో భాగంగా పైలెట్‌ ప్రాజెక్ట్‌గా రాచానపల్లి, సైదాపురం సొసైటీలను ఎంచుకున్నామన్నారు. కూడేరు, యల్లనూరు, పెడబల్లి, ముదిగుబ్బ, కణేకల్లు, రొద్దం, నార్పల, ఆమిద్యాల సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోలు బంకులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జనవరి 8వ తేదీన 80 పో స్టుల భర్తీకి పరీక్ష నిర్వహిస్తామనీ, ఫిబ్రవరి 1వతేదీ నాటికి విధుల్లో చేరే విధంగా ప్రక్రియ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పాలకవర్గసభ్యులు భీమక్క, శంకర్‌రెడ్డి, శివలింగప్ప, హైదర్‌వలీ, ఈశ్వర్‌రెడ్డి, జనార్దనరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ సురేఖారాణి, డీజీఎం సుఖదేవబాబు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:29:55+05:30 IST