చేనేత రిజర్వేషన్‌ ఉల్లంఘిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-10-07T06:44:01+05:30 IST

చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అ నుసరిస్తూ మరమగ్గాలను కేటా యించిన 11 రకాలను మాత్రమే య జమమానులు తయారు చేయాలని చేనేత, జౌళి శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (తి రుపతి) డీడీ భీమయ్య పేర్కొన్నా రు.

చేనేత రిజర్వేషన్‌ ఉల్లంఘిస్తే చర్యలు

చేనేత, జౌళి శాఖ డీడీ భీమయ్య

ధర్మవరం, అక్టోబరు 6: చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని అ నుసరిస్తూ మరమగ్గాలను కేటా యించిన 11 రకాలను మాత్రమే య జమమానులు తయారు చేయాలని చేనేత, జౌళి శాఖ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (తి రుపతి) డీడీ భీమయ్య పేర్కొన్నా రు. పట్టణంలోని శాంతినగర్‌లోని ఓపంక్షన్‌ హాల్లో  బుధవారం పవర్‌ లూమ్స్‌ నిర్వాహకులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 11రకాల చేనేత రిజర్వేషన్‌ను పాటించాలని సూచించారు. చేతి మగ్గాలకు నష్టం చేకూరేలా పవర్‌లూమ్స్‌లో వస్ర్తాలు తయారు చేయ రాదన్నారు. నిబంధనల ప్రకారం 45శాతం పట్టురేషం, 55శాతం పాలిస్టర్‌ కలిపి చీరలు, వస్ర్తాలను తయారుచేయాలన్నారు. వందశాతం పట్టు రేషంతో చేనేత రకాల చీరలు తయారు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినా తమ దాడుల్లో పట్టుబడిననా కఠినచర్యలు తప్పవన్నారు.  ఈ కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ సహాయ సంచాలకులు రమేశ్‌, ఏడీఓ శ్రీనివాసులు, ఏడీఓలు నరసింహారెడ్డి, శీనానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-07T06:44:01+05:30 IST