సూర్యప్రభ వాహనంలో ఊరేగిన చెన్నకేశవుడు
ABN , First Publish Date - 2021-05-20T06:11:14+05:30 IST
లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఉత్సవాలను బుధవారం ఆలయకమిటీ, అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు.

ధర్మవరంఅర్బన,మే 19: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఉత్సవాలను బుధవారం ఆలయకమిటీ, అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం స్వామి వారి మూలవిరాట్‌లను వివిధ రకాలపూలతో అలంకరించి సూర్యప్రభవాహనంలో ఊరేగించారు. ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.