ఆర్డీటీ ఆస్పత్రిలో గైనకాలజి్‌స్టను నియమించాలి

ABN , First Publish Date - 2021-08-20T06:18:12+05:30 IST

కణేకల్లు క్రాసింగ్‌ ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రసవాల కోసం గైనకాలజిస్ట్‌ వైద్యులను నియమించాలని క్రాసింగ్‌ వాసులు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ను కోరారు.

ఆర్డీటీ ఆస్పత్రిలో గైనకాలజి్‌స్టను నియమించాలి
అన్నేఫెర్రర్‌తో మాట్లాడుతున్న గ్రామస్థులు

 

కణేకల్లు, ఆగస్టు 19: కణేకల్లు క్రాసింగ్‌ ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రసవాల కోసం గైనకాలజిస్ట్‌ వైద్యులను నియమించాలని క్రాసింగ్‌ వాసులు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ప్రొగ్రామ్‌ డైరెక్టర్‌ అన్నేఫెర్రర్‌ను కోరారు. గురువారం క్రాసింగ్‌లోని ఆర్డీటీ ఆస్పత్రికి వచ్చిన ఆమెను క్రాసింగ్‌ వాసులతో పాటు పలువురు రోగులు కలసి ఇక్కడి సమస్యను విన్నవించారు. ప్రధానంగా గతంలో గర్భవతులు, చిన్నపిల్లలకు ఇక్కడ వైద్యం చేసేవారని, రెండేళ్ల నుంచి ఆ సౌకర్యా లు లేకపోవడంతో రాయదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ఇక్కడు వ చ్చే ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కణేకల్లు క్రాసింగ్‌లో ని ఆర్డీటీ ఆస్పత్రి పూర్తి నిర్లక్ష్యానికి గురైందని, వెంటనే తమరు స్పందించి అన్ని సౌకర్యా లు మెరుగుపరచి ఆర్డీటీకు పూర్వ వైభవం తీసుకురావాలని వారు కోరారు. వీరి వినతిని విన్న అన్నేఫెర్రర్‌ ఆర్డీటీ ఆస్పత్రిలో గైనకాలజి్‌స్టను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో క్రాసింగ్‌ వాసులు ఉదయ్‌, అశోక్‌, మారుతి, ప్ర తాప్‌, రంగప్పరాజు, విశ్వనాథ్‌, రాము, లింగప్ప పాల్గొన్నారు.  


Updated Date - 2021-08-20T06:18:12+05:30 IST