కళ్యాణదుర్గంలో 43 వార్డులు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-02-06T06:55:37+05:30 IST

కళ్యాణదుర్గం మండల ప రిధిలో 182వార్డులకు గాను355 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో 43 వార్డులు ఏకగ్రీవమైనట్లు అసిస్టెంట్‌ ఎ న్నికల అధికారి కొండన్న తెలిపారు.

కళ్యాణదుర్గంలో 43 వార్డులు ఏకగ్రీవం
నామినేషన్ల పరిశీలనలో అధికారులు, అభ్యర్థులు

కళ్యాణదుర్గం, ఫిబ్రవరి 5: కళ్యాణదుర్గం మండల ప రిధిలో 182వార్డులకు గాను355 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇందులో 43 వార్డులు ఏకగ్రీవమైనట్లు అసిస్టెంట్‌ ఎ న్నికల అధికారి కొండన్న తెలిపారు. భట్టువానిపల్లిలో 5, 6, 10 వార్డులు, బోరంపల్లిలో 1, 2, 3, 4,5, 6, 7, 8, 9, 10 వార్డులు, తూర్పు కోడిపల్లిలో 9వ వార్డు, గోళ్లలో 5వ వార్డు, హుళికల్లులో 2వ వార్డు, కొత్తూరులో 3, 7 వార్డులు, ఎం కొండాపురంలో 1, 2, 3, 4, 5, 6, 8 వార్డులు, ముద్దినాయనపల్లిలో 3, 7, 12 వార్డులు, మానిరేవులో ఒకటో వార్డు, పాలవాయిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12 వార్డులు, పీటీఆర్‌పల్లి తండాలో 5వ వార్డు, తిమ్మసముద్రంలో 5, 12వ వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇందు లో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు ఆయా వార్డులకు నా మినేషన దాఖలు చేయడంలో విఫలమయ్యారా లేక ఏకగ్రీవాలకే మొగ్గుచూపారా అన్నది గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా 17 గ్రామ పంచాయితీలకు గాను 73 నామినేషన్లు దాఖలయ్యాయి. 


కంబదూరులో... మండలవ్యాప్తంగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన కొనసాగింది. 12 పంచాయతీలకు గాను 82 మంది అభ్యర్థులు సర్పంచు స్థానాలకు నామినేషన దాఖలు చేయగా, 142 వార్డు మెంబర్‌ స్థానాలకు 433 నా మినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పంచాయతీల ఎన్నికల అధికారులు నామినేషన్లు క్షుణంగా పరిశీలించారు. అనంతరం సర్పంచు స్థానాలకు 67 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 410 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇం దులో కర్తనపర్తి పంచాయతీ 3 వార్డుల నామినేషన్లు తిరస్కరించినట్లు ఎంపీడీఓ శివారెడ్డి తెలిపారు. నూతిమడు గు 6వ వార్డు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు. 


బ్రహ్మసముద్రంలో... మండలంలోని 16 గ్రామ పం చాయతీలకు గాను 91 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఎన్నికల అసిస్టెంట్‌ అధికారులు నామినేషన్లు పరిశీలించారు. బైరవానితిప్ప గ్రామ పంచాయతీలో ఒక నామినేషన తిరస్కారానికి గురైంది. 170 వార్డులకు గాను 372 నామినేషన్లు రాగా వాటిలో 8 నామినేషన్లు తిరస్కరించినట్లు ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. 16 సర్పంచు స్థానాలకు 90 మంది, 170 వార్డులకు 362 మంది బరిలో ఉన్నా రు. రాయలప్పదొడ్డిలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. 


శెట్టూరులో... మండలంలో 16 గ్రామ పంచాయతీలకు గాను 113, 170 వార్డు స్థానాలకు గాను 386 నామినేషన్లు దాఖలయ్యాయి. పెరుగుపాళ్యం, తిప్పనపల్లి, అయ్యగార్లపల్లి, బచ్చేహళ్లి, అనుంపల్లి, చిన్నంపల్లిలో ఒక్కో వార్డు చొ ప్పున ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అసిస్టెంట్‌ అధికారిణి గంగావతి తెలిపారు. 


కుందుర్పిలో... మండలంలో 13 గ్రామ పంచాయతీల కు గాను 99 నామినేషన్లు దాఖలయ్యాయి. 24 నామినేష న్లు రెండు సార్లు దాఖలుచేయడంతో వాటిని తొలగిం చా రు. దీంతో సర్పంచు స్థానాలకు 75 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అసిస్టెంట్‌ అధికారి నారాయణస్వామి తెలిపారు.   148 వార్డులకు గాను 363 నామినేషన్లు దాఖ లు కాగా, ఇందులో రెండు నామినేషన్లు తిరస్కరించామరన్నారు. దీంతో వార్డు స్థానాల్లో మొత్తం 361 మంది నామినేషన్లు ధ్రువీకరించినట్లు అధికారులు తెలిపారు. 


కళ్యాణదుర్గం టౌన: మండలంలోని మానిరేవు పంచాయతీకి చెందిన వైసీపీ మద్దతుదారుల పత్రాలలో సరైన సంతకాలు లేకపోవడంతో అధికారులు సంబంధిత అభ్య ర్థులను పిలిపించి సంతకాలు చేయించుకోవడానికి ప్ర యత్నించారు. గమనించిన టీడీపీ మద్దతుదారులు అడ్డు కున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అధికారి కొండన్న జరిగిన విషయంపై ఆరాతీశారు. ఎ లాంటి అభ్యంతరాలున్నా ఎన్నికల నియమావళి ప్రకారం శనివారం తెలపాలని పార్టీల మద్దతు దారులకు సూచించడంతో సమస్య సద్దుమణిగింది.


Updated Date - 2021-02-06T06:55:37+05:30 IST