ఎస్కేయూ విద్యార్థికి రూ.30 లక్షల వేతనం

ABN , First Publish Date - 2021-11-09T06:51:56+05:30 IST

ఎ స్కేయూలో బీటెక్‌ సీఎ్‌ససీ చివరి సంవత్సరం అభ్యసిస్తున్న నిఖిల్‌కుమార్‌ ఏకంగా రూ.30 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యాడు.

ఎస్కేయూ విద్యార్థికి రూ.30 లక్షల వేతనం
నిఖిల్‌ కుమార్‌ను అభినందిస్తున్న వీసీ, ప్రిన్సిపాల్‌

బీటెక్‌ చదువుతుండగానే ఉద్యోగానికి ఎంపిక

 అనంతపురం అర్బన, నవంబరు 8 : ఎ స్కేయూలో బీటెక్‌ సీఎ్‌ససీ చివరి సంవత్సరం అభ్యసిస్తున్న నిఖిల్‌కుమార్‌ ఏకంగా రూ.30 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యాడు. అంతర్ఞాతీయ స్థాయి లో పేరుగాంచిన ఇంటె ల్‌ కార్పొరేషన సంస్థలో ఉద్యోగం సాధించాడు. దీంతో నిఖిల్‌ కుమార్‌ను వీసీ రామకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జయచంద్ర సోమవారం అభినందించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాలో రూ.30 లక్షల వార్షిక వేతనానికి ఎంపికైన ఏకైక విద్యార్థిగా నిఖిల్‌కుమార్‌ సరికొత్త చరిత్రను సృష్టించారన్నారు. ఎస్కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో అందిస్తున్న విద్యాబోధన, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడానికి దోహపడుతున్నాయన్నారు. ఏటా వందలాది మంది విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్లకు ఎంపికవుతున్నారన్నారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ క్రిష్ణకుమారి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ రాజే్‌షకుమార్‌ గౌడ్‌, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T06:51:56+05:30 IST