26 మంది జూదరుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-12-25T05:47:33+05:30 IST

పెనుకొండ పోలీస్‌ సర్కిల్‌ పరిధి రొద్దం మండలం కలిపి గ్రామ సరిహద్దులో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 26 మంది జూదరులను అరెస్ట్‌ చేశారు.

26 మంది జూదరుల అరెస్ట్‌
పట్టుబడిన పేకాటరాయుళ్లతో పోలీసు అధికారులు

రూ. 1.48 లక్షలు స్వాధీనం 

పెనుకొండ, డిసెంబరు 24 : పెనుకొండ పోలీస్‌ సర్కిల్‌ పరిధి రొద్దం మండలం కలిపి గ్రామ సరిహద్దులో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 26 మంది జూదరులను అరెస్ట్‌ చేశారు. వారి  నుంచి రూ.1.48 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సర్కిల్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల్లో పేకాట శిబిరాలు నిర్వహించి జూదమాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డీఎస్పీతో పాటు తాను మూడు మండలాలకు చెందిన ఎస్‌ఐలతో కలిసి రొద్దం మండలం కలిపి గ్రామం వద్ద జూద గృహంపై ఈ దాడి చేశామన్నారు. జూదమాడుతున్నట్లు వారి నుంచి దీని వెనక ఎవరెవరున్నారన్నది  విచారిస్తున్నామని.. ఎలాంటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు రమే్‌షబాబు, వెంకటరమణ, మస్తాన ఉన్నారు. 

Updated Date - 2021-12-25T05:47:33+05:30 IST