యల్లనూరులో 22 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-18T05:57:55+05:30 IST

మండలంలో సోమవారం 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.

యల్లనూరులో 22 పాజిటివ్‌ కేసులు నమోదు

యల్లనూరు, మే 17: మండలంలో సోమవారం 22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు. నిట్టూరులో 10, తిరుమలాపురం 6, యల్లనూ రు, వెన్నపూసపల్లిలో 2, జంగంపల్లి, పాతపల్లిలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున నిబంధనలు తప్పనిసరిగా పా టించాలని ఆయన సూచించారు. 


యాడికిలో 20..

యాడికి : మండలంలో సోమవారం 20 మందికి పా జిటివ్‌గా నమోదైనట్లు డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ అ ప్పయ్య తెలిపారు. యాడికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 18 పాజిటివ్‌కేసులు, రాయలచెరువు ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-18T05:57:55+05:30 IST