అధికారుల గైర్హాజరుపై జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-20T04:45:32+05:30 IST

అధికారుల గైర్హాజరుపై జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆగ్రహం

అధికారుల గైర్హాజరుపై జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ వై్‌స చైర్మన్‌ఈట గణేష్‌

నందిగామ: నందిగామ మండల కేంద్రంలో శనివారం ఎంపీపీ ప్రియాంకశివశంకర్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కొందరు అధికారుల గైర్హాజరుపై జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైస్‌చైర్మన్‌ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చాలని సూచించారు. పలువురు ప్రజాప్రతినిధులు రోడ్లు, నీటి సమస్యలపై అధికారులను నిలదీశారు. అధికారులు సర్వసభ్యసమావేశానికి హాజరు కాకపోతే వారిపై పైఅధికారులకు ఫిర్యాదు చేస్తామని జడ్పీ వైస్‌ చైర్మన్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల్‌రెడ్డి, సర్పంచులు పాండురంగారెడ్డి, జేకే నర్సింలు, స్వామి, గోవిందు అశోక్‌, ఎనుగొండ రమే్‌షగౌడ్‌, రాజునాయక్‌, రాములమ్మ, కవిత, ఎల్లమ్మ ఎంపీటీసీలు కొమ్ము క్రిష్ణ, దేపల్లి కుమార్‌గౌడ్‌, చంద్రపాల్‌రెడ్డి, రాజునాయక్‌, కాట్నమాదవి, కళమ్మ తదితరులు పాల్గొన్నారు.  

Read more