రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-02-12T09:20:11+05:30 IST

రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎదులాబాద్‌కు

రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి


ఘట్‌కేసర్‌ రూరల్‌:  రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎదులాబాద్‌కు చెందిన గ్యార వెంకటేష్‌ తన అనుచరులతో కలిసి మంగళవారం జడ్పీ చైర్మన్‌ సమక్షంలో టీఅర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని గుర్తుచేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు టీఅర్‌ఎ్‌సలో చేరుతున్నారని గుర్తుచేశారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. సహకార సంఘం ఎన్నికలలో 8వ వార్డు నుంచి బరిలో నిలిచిన గ్యార వెంకటే్‌ష గెలిచే విధంగా ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఅర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివా్‌సగౌడ్‌, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంకం రవి, మాజీ ఉపసర్పంచు అకిటి సుధాకర్‌రెడ్డి, టీఅర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కందుల కుమార్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-02-12T09:20:11+05:30 IST