యాసంగి సాగు పండగే.. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-12-31T05:09:40+05:30 IST
యాసంగి సాగు పండగే.. ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి వ్యాఖ్యలు
పరిగి: యాసంగి పంటల సాగు పండగేనని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం పరిగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు పొలాలకు నీరు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతప్రభుత్వాలు దండగన్న వ్యవసాయాన్ని పండగే అన్న విధంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. వర్షాలు పుష్కలంగా కురిసిన కారణంగా పంటలు కూడా రెట్టింపుస్థాయిలో సాగవుతున్నాయని తెలిపారు. యాసంగి రైతుబంధు కింద ప్రతి ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సహాయాన్ని రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, చైర్మన్ ఎం.అశోక్, జడ్పీటీసీబి.హరిప్రియ, ఎంపీపీ అరవింద్‌రావు, మాజీ జడ్పీటీసీ మీరుమహమూద్‌అలీ, భాస్కర్, ప్రవీణ్‌రెడ్డి, ఆంజనేయులు, సురేందర్ పాల్గొన్నారు. కాగా బుధవారం పరిగిలో వివిధ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరూ కూడా చికిత్సలకు డబ్బులు లేవని ఇబ్బందులు పడకూడదన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పరిగి మండలం కాళ్ళాపూర్ లొంక ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. గ్రామస్థులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు.