లాక్‌డౌన్‌తో తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2020-04-14T11:39:39+05:30 IST

లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఉపాధి లేక వలస కూలీలు 150కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామానికి కాలినడకన బయలుదేరారు.

లాక్‌డౌన్‌తో తప్పని తిప్పలు

శంకర్‌పల్లి - దేవరకొండ వయా కేశంపేట

కాలినడకన స్వగ్రామాలకు బయలుదేరిన వలస కూలీలు


కేశంపేట: లాక్‌డౌన్‌ పొడిగింపుతో ఉపాధి లేక వలస కూలీలు 150కి.మీ దూరంలో ఉన్న స్వగ్రామానికి కాలినడకన బయలుదేరారు. మండుటెండలో తమ పిల్లలను భుజాలపై ఎత్తుకెళ్తున్న దృశ్యాన్ని చూసి పలువురు చలించిపోయారు. చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు వెంచర్లో దేవరకొండకు చెందిన మూడు కుటుంబాలు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారే అక్కడే ఉండిపోయారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించడంతో ఉపాధి లేక సోమవారం ఉదయం శంకర్‌పల్లి నుంచి దేవరకొండకు కేశంపేట మీదుగా వెళ్తున్నారు.


ఆ వలస కుంటుంబాలను వలస కుటుంబాలను చూసి కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చలించిపోయారు. వారి వివరాలు తెలుసుకుని వసతి కల్పిస్తామని అంతవరకు  కేశంపేటలోనే ఉండాలని సూచించారు. అదేవిధంగా స్థానిక సర్పంచ్‌ వెంకట్‌రెడ్డికి ఆ కుటుంబాలకు భోజన వసతి కల్పించాలని ఎస్‌ఐ సూచించారు. స్పందించిన సర్పంచ్‌ వారికి భోజనం పెట్టించారు. ఈ విషయంలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు చొరవను పలువురు అభినందించారు.

Updated Date - 2020-04-14T11:39:39+05:30 IST