కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-06-18T10:13:59+05:30 IST
అకారణంగా తొలగించిన హెచ్‌పీసీఎల్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి సబిత డిమాండ్ చేశారు.
ఘట్‌కేసర్: అకారణంగా తొలగించిన హెచ్‌పీసీఎల్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి సబిత డిమాండ్ చేశారు. బుధవారం పోచారం మున్సిపాలిటీలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో కార్మికులకు సంఘీభావంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తే పనిలోంచి తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, ఎల్లమ్మ పాల్గొన్నారు.