వైర్లకు అల్లుకున్న తీగలు

ABN , First Publish Date - 2020-03-02T10:53:15+05:30 IST

పరిగి మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన జోడు స్తంభాలకు ముళ్లతీగలు అల్లుకున్నా ఆ శాఖ సిబ్బంది వాటిని

వైర్లకు అల్లుకున్న తీగలు

పరిగి(రూరల్‌): పరిగి మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన జోడు స్తంభాలకు ముళ్లతీగలు అల్లుకున్నా ఆ శాఖ సిబ్బంది వాటిని తొలగించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. గ్రామ శివారులోని పీతిరికుంట కట్ట పక్కన ఉన్న జోడు స్తంభాలకు అల్లుకున్న తీగలతో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోందని, మేకలు, పశువులు విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యే అవకాశం పొంచి ఉందని  పేర్కొంటున్నారు.  చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-03-02T10:53:15+05:30 IST