పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-12T06:38:32+05:30 IST

పరిగి పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణ ప్రగతిలో

పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తా  : ఎమ్మెల్యే

పరిగి: పరిగి పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిగి పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శవంతంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. పరిగి పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చుకుందామని చెప్పారు. ఎక్కడా చెత్త లేకుండా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వురుగా చేసి ఇంటికి వచ్చే చెత్త బండితో వేయాలని సూచించారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌,  మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్‌రెడ్డి,  కౌన్సిలర్లు వార్ల రవీంద్రా,  వేముల కిరణ్‌, నాయకులు భాస్కర్‌, సురేందర్‌,వెంకటయ్య, శ్రీశైలంలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T06:38:32+05:30 IST