అండర్‌పాస్‌ నిర్మాణం ఎప్పుడో..?

ABN , First Publish Date - 2020-12-18T04:15:56+05:30 IST

అండర్‌పాస్‌ నిర్మాణం ఎప్పుడో..?

అండర్‌పాస్‌ నిర్మాణం ఎప్పుడో..?
అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మించాల్సిన ఉప్పరిగూడ క్రాసింగ్‌ ఇదే..

ప్రమాదకరంగా ఉప్పరిగూడ క్రాస్‌ రోడ్డు  

అండర్‌పాస్‌ బ్రిడ్జి కోసం 2016లో ప్రతిపాదనలు 

‘పట్నం’ చౌరస్తా వద్ద తికమక

ఇబ్రహీంపట్నం: నాగార్జునసాగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కొనకట్ట ఉప్పరిగూడ క్రాస్‌ రోడ్డు వద్ద ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ అండర్‌పాస్‌ నిర్మాణం కోసం ప్రతిపాదనలు 2016లో రూ.2 కోట్లతో ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్ప టి వరకూ అది అతీగతీలేదు. ఇక్కడ హైదరాబాద్‌ వైపు వెళ్లే రహదారి కొనకట్ట వద్ద ఉప్పరిగూడ వైపు వాహనాలు వెళ్లాలంటే ప్రధాన రోడ్దును దాటాల్సి ఉంది. ఇక్కడ హైదరాబాద్‌ వైపు రోడ్డు డౌన్‌ ఉండటంతో వాహనాలు కిందివైపు వేగంగా వెళ్తుంటాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ వేర్వేరుగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎంతచూసుకుని రోడ్డు క్రాస్‌ చేస్తున్నా నగరం వైపు వెళ్లే వాహనాలు దగ్గరకు వచ్చే వరకు గమనించే పరిస్థితి ఉండదు. ఇక్కడ అండర్‌ పాస్‌ బ్రిడ్జి నిర్మాణం తప్ప వేరే మార్గమంటూ లేదు. ఈ రోడ్డుపై వాహనదారులు నిత్యం భయంతో రోడ్డు దాటుతున్నారు. 

పట్నం చౌరస్తాలో ఏదారి ఎటుపోతుందో తెలియదు..

ఇదే ప్రధాన రహదారిపై ఉన్న ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద ఏదారి ఎటుపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడ రోడ్డు మధ్యలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని రోడ్డు విస్తరణలో తొలగించి పక్కన తిరిగి ప్రతిష్ఠించారు. గ్రిల్స్‌ ఏర్పాటుచేసి పూలమొక్కలు, గడ్డి పెంచారు. ఈ విగ్రహానికి తూర్పువైపున మరో రోడ్డు వేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ చౌరస్తా వద్ద ఏ వాహనం ఎటుపోతుందో తెలియక అయోమయంగా ఉంది. ఇక్కడ చౌరస్తాలో మరో సర్కిల్‌ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారుల నుంచి స్పందన లేదు. ఈ చౌరస్తా నుంచి ఓ దారి నాగార్జునసాగర్‌- హైదరాబాద్‌ వైపు, మరోటి ఇబ్రహీంపట్నం పట్టణంలోకి వెళ్లేందుకు ఉంది. పట్టణంలోంచి హైరదాబాద్‌, సాగర్‌ వైపు వెళ్లేందుకు ఇక్కడ నుంచే వాహనాలు వెళ్లాలి. 

ఇక్కడే మంచాల రోడ్డువైపు వాహనాలు క్రాస్‌ అవుతాయి. కాగా ఇక్కడ ఏ వాహనం ఎటుపోతుందో తెలియక తికమకగా ఉంటుంది. ఎవరు ఏ వైపు తిరుగుతారో తెలియని పరిస్థితి లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం ఇక్కడ సూచిక బోర్డులు కూడా లేకపోవడంతో కొత్తవారు రాత్రి వేళల్లో  ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ సర్కిల్‌ ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మించాలి

ఉప్పరిగూడ క్రాస్‌రోడ్డువద్ద రోడ్డు అత్యంత ప్ర మాదకరంగా మారింది. వాహనాలను రోడ్డు దా టించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లా ల్సి వస్తుంది. ఉప్పరిగూడ క్రాస్‌ రోడ్డు వద్ద వెంటనే అండర్‌పాస్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. అధికారులు స్పందించి వెంటనే రోడ్డు నిర్మించాలి.

 - కోట్ల విష్ణువర్ద్ధన్‌రెడ్డి, ఇబ్రహీపట్నం

Updated Date - 2020-12-18T04:15:56+05:30 IST