బండి సంజయ్‌కి ఘన స్వాగతం
ABN , First Publish Date - 2020-03-16T06:22:50+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్‌కి ఆదివారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుష్ఫగుచ్ఛాలు, శాలువలతో స్వాగతం పలికారు.
ఎయిర్‌పోర్టుకు తరలివచ్చిన కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు
శంషాబాద్ రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్‌కి ఆదివారం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పుష్ఫగుచ్ఛాలు, శాలువలతో స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. భార్య, పిల్లలతో పాటు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘునందన్‌రావు, ఎమ్మెల్సీ రాంచంర్‌రావు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, యేగేంఽధర్ గుప్తా, వాసుదేవారావు గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బుక్క వేణుగోపాల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రేంరాజ్, బీజేవైఎం జిల్లా అఽధ్యక్షుడు బైతి శ్రీధర్‌యాదవ్, బీజేపీ జిల్లా కార్యదర్శి చింతల నందకిశోర్ తదితరులు స్వాగతం పలికారు. కార్యకర్తలు, నాయకులు భారత్ మాతకీ జై అంటూ నినాదాలు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోవడంతో అతి తక్కువ మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్‌లో నగరానికి తరలివెళ్లారు. అయితే ఆయన రాకకోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేశారు.