ఇకనుంచి ఫిజికల్‌ ఫైళ్లకు స్వస్తి..ఈ-ఆఫీస్‌ ఫైళ్లనే పరిశీలిస్తాం

ABN , First Publish Date - 2020-08-16T09:55:33+05:30 IST

ఇకనుంచి ఫిజికల్‌ ఫైళ్లకు స్వస్తి చెప్పి.. ఈ-ఆఫీస్‌ ఫైళ్లనే పరిశీలిస్తామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు.

ఇకనుంచి ఫిజికల్‌ ఫైళ్లకు స్వస్తి..ఈ-ఆఫీస్‌ ఫైళ్లనే పరిశీలిస్తాం

కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఇకనుంచి ఫిజికల్‌ ఫైళ్లకు స్వస్తి చెప్పి.. ఈ-ఆఫీస్‌ ఫైళ్లనే పరిశీలిస్తామని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఈ-ఆఫీస్‌ మంత్రి సబితారెడ్డి ప్రారంభించిన అనంతరం ఆయన అదనపుకలెక్టర్లు హరీష్‌, ప్రతీక్‌జైన్‌తో కలిసి జిల్లాఅధికారులతో సమావేశమయ్యారు. ప్రతీ కార్యాలయంలో విధిగా ఈ-ఆఫీస్‌ను పాటించా లన్నారు. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌పాలనకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా మెయిల్‌ ఐడీలను క్రియేట్‌ చేసుకుని, డిజిటల్‌ ‘కీ’లను పొందాలని సూచించారు. ఈ విషయంలో ఏదైనా సందేహాలు, సమస్యలుంటే జిల్లా సమాచార అధికారి డీఐవోను సంప్రదించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-08-16T09:55:33+05:30 IST