నీటి కోసం ప్రజల నిరసన

ABN , First Publish Date - 2020-12-06T05:39:02+05:30 IST

నీటి కోసం ప్రజల నిరసన

నీటి కోసం ప్రజల నిరసన
ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు

  • దిగివచ్చిన సర్పంచ్‌..  
  • పైప్‌లైన్‌కు మరమ్మతులు

చేవెళ్ల: మండలంలోని ఆలూర్‌ గ్రామ ఒకటో వార్డులో  నెలకొన్న నీటి సమస్యపై ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోయారు. సమస్య పరిష్కరించాలని శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వార్డు సభ్యురాలు లక్ష్మమ్మ, ఎంపీటీసీలు నరేందర్‌చారి, యాదమ్మ వారికి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ.. సర్పంచ్‌ విజయలక్ష్మి ఒకటో వార్డు ప్రజలపై కక్షగట్టి నీటి సరఫరా చేయడంలే దన్నారు. సమస్య తీర్చాలని పలుమార్లు సర్పంచ్‌కు చెప్పినా పట్టించుకోలేదన్నారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ నుంచి మినీ ట్యాంక్‌కు కనెక్షన్‌ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా సర్పంచ్‌ స్పందించలేదన్నారు. తాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని గ్రామస్థులు పట్టుబట్టారు. దీంతో కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, సర్పంచ్‌ స్పందించి అప్పటికప్పుడు కొత్త పైప్‌ను తెప్పి ంచి నీటిని అందించారు. ప్రజలు ఆందోళన విరమించారు. అనంతరం సర్పంచ్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అందరి సహకారం అవసరమని, తనకు ఎవరిమీదా కోపం లేదన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎంపీటీసీలు, వార్డు మెంబర్‌ ప్రజలతో కలిసి ఆందోళనలో పాల్గొనడం సరికాదన్నారు.

Updated Date - 2020-12-06T05:39:02+05:30 IST