హరితహారంలో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2020-08-01T10:47:35+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.

కీసర: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామలు కావాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా శుక్రవారం మండల కేంద్రం కీసరలో కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు చక్కటి ఆహ్లదకరమైన వాతవరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. మండల కేంద్రం కీసరలో శిథిలావస్థలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీహాల్ నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ శాంన్‌సన్, మాధురి, నారాయణ శర్మ, పద్మావతి ఉన్నారు.