లాక్‌డౌన్‌ కాలంనాటి వేతనాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-06-25T10:10:22+05:30 IST

లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని బుధవారం జాఫర్‌పల్లి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ యాదయ్యకు అవర్స్‌బేస్డ్‌ టీచర్స్‌ వినతిపత్రం అందజేశారు.

లాక్‌డౌన్‌ కాలంనాటి వేతనాలు ఇవ్వాలి

పరిగి: లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి వేతనాలు చెల్లించాలని బుధవారం జాఫర్‌పల్లి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ యాదయ్యకు అవర్స్‌బేస్డ్‌ టీచర్స్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము పూర్తిగా ఉపాధ్యాయ వృత్తికే అంకితమయ్యామని, మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

Updated Date - 2020-06-25T10:10:22+05:30 IST