భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జయంతి

ABN , First Publish Date - 2020-09-18T06:27:08+05:30 IST

తాండూరులో విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) సంఘం తాండూరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి, యజ్ఞ

భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జయంతి

తాండూరు/పరిగి/కులకచర్ల : తాండూరులో విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) సంఘం తాండూరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ జయంతి, యజ్ఞ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 7గంటలకే పుణ్యాహవచన, విశ్వకర్మ పతాక ధ్వజారోహణ, నవగ్ర హ, గణపతి పూజలు నిర్వహించిన అనంతరం హోమం, మహా మంగళహారతి నిర్వహించారు. విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పులేందర్‌చారి, సుధాకర్‌చారి, రవిచారి, పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీ మధుల శ్రీనివా్‌సచారి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటే్‌షచారి పాల్గొన్నారు.


పరిగిలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరాచారి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో విశ్వకర్మ జయంతిని జరుపుకున్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీశైలం, అనంతయ్య, గోపాలాచారి, సిద్దిరాజు, నారాయణచారి పాల్గొన్నారు.  కులకచర్ల మండల కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో విశ్వకర్మ భగవాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నయ్యచారి, రాఘవేంద్రచారి, రాములు, రమేశ్‌, విశ్వేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T06:27:08+05:30 IST