ఆద్రాస్‌పల్లిని సందర్శించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

ABN , First Publish Date - 2020-02-27T06:15:54+05:30 IST

విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం మంగళవారం మూడుచింతలపల్లి మండలంలోని ఆద్రా్‌సపల్లి గ్రామాన్ని సందర్శించింది. 30 రోజుల ప్రణాళిక

ఆద్రాస్‌పల్లిని సందర్శించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

శామీర్‌పేట రూరల్‌ : విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం మంగళవారం మూడుచింతలపల్లి మండలంలోని ఆద్రా్‌సపల్లి గ్రామాన్ని సందర్శించింది. 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ప్రవీణ్‌, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు హరితహారంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని సందర్శించారు. రోడ్డుకిరువైపుల నాటిన మొక్కలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ కార్యాలయాల్లో నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మూడుచింతలపల్లి మండలం పోతారంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బోయిని లలితానర్సింలు, ఎంపీడీవో సువిధ, ఏపీఎం రవి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-27T06:15:54+05:30 IST