వాట్సాప్‌లో అశ్లీల వీడియో అప్‌లోడ్‌ చేసిన అధికారి.. క్షణాల్లో వైరల్..

ABN , First Publish Date - 2020-07-15T14:52:58+05:30 IST

వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మండలస్థాయి ప్రభుత్వ అధికారి అశ్లీల వీడియో అప్‌లోడ్‌ చేశారు. ఇదికాస్తా వైరల్‌గా మారడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మా రింది. మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న

వాట్సాప్‌లో అశ్లీల వీడియో అప్‌లోడ్‌ చేసిన అధికారి.. క్షణాల్లో వైరల్..

కీసర (మేడ్చల్): వాట్సాప్‌ గ్రూప్‌లో ఓ మండలస్థాయి ప్రభుత్వ అధికారి అశ్లీల వీడియో అప్‌లోడ్‌ చేశారు. ఇదికాస్తా వైరల్‌గా మారడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మా రింది. మేడ్చల్‌ జిల్లా కీసర మండల పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఇటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు, విలేకరులకు సమాచారాన్ని చేరవేసేందుకు గతంలో కీసర హరితహారం అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. ఈ గ్రూప్‌లో కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, బిల్‌కలెక్టర్లు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. సోమవారం రాత్రి 11గంటలకు ఓ మండల స్థాయి అధికారి కీసర హరితహారం గ్రూప్‌లో అశ్లీల వీడియో పోస్ట్‌ చేసింది. ఇది వైరల్‌ కావడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో గ్రూప్‌ అడ్మిన్లుగా ఉన్న ఇద్దరు వెంటనే గ్రూప్‌ను డిలిట్‌ చేసి కొత్త గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ఉద్యోగి ఇలా చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 


పొరపాటున పోస్ట్‌ అయింది : అధికారి 

వాట్సా్‌పలో వైరల్‌గా మారిన వీడియో పొరపాటున పోస్ట్‌ అయింది. ఎన్‌ఆర్‌జీఈఎస్‌ పథకంలో భాగంగా డ్రమ్ములో ఇంకుడు గుంతల ఏర్పాటు ఫొటోలు వాట్సా్‌పలో వచ్చాయి. ఇలాంటి కార్యక్రమం మండలంలో చేస్తే బాగుంటుందనే ఉద్ధేశంతో ఇంకుడు గుంతల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకున్నాను. ఈ క్రమంలో అందులో అసభ్యకర వీడియో ఉన్నదని గ్రహించలేదు. పొరపాటున గ్రూప్‌లో పోస్టు చేశాను. ఇందులో వేరే ఉద్దేశం లేదని సదరు అధికారి వివరణ ఇచ్చారు. 

Updated Date - 2020-07-15T14:52:58+05:30 IST