పోటాపోటీగా వీరశైవ సమాజం ఎన్నికలు

ABN , First Publish Date - 2020-12-28T05:21:06+05:30 IST

పోటాపోటీగా వీరశైవ సమాజం ఎన్నికలు

పోటాపోటీగా వీరశైవ సమాజం ఎన్నికలు
తాండూరులో పోలింగ్‌ సందర్భంగా అభ్యర్థులు, ఓటర్ల సందడి

రెండు ప్యానళ్ల నడుమ గట్టి పోటీ ఫ పోలీసుల భారీ బందోబస్తు

తాండూరు : కోర్టు ఆదేశాల మేరకు న్యాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం తాండూ రు పట్టణంలో వీరశైవ సమాజం ఎన్నికలు జరిగాయి. ఈ పోటీల్లో 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. భద్రేశ్వరస్వామి ఆలయంలోని వీరశైవ సమాజం కార్యాలయంలో ఈ ఎన్నికను నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. సాయం త్రం 5 గంటల వరకు కౌంటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. రెండు ప్యానళ్లు గట్టిగా పోటీనిచ్చాయి. 870 ఓట్లు ఉండగా, 714 ఓట్లు పోలయ్యాయి. 81శాతం ఓటింగ్‌ జరిగింది. 38 మంది బరిలో నిలిచారు. ఆర్‌.బస్వరాజ్‌, పటేల్‌ శ్రీశైలం ప్యానళ్లు పోటీపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో బరిలో నిలిచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. పోటీచేసిన అభ్యర్థులు 15 మంది గెలిస్తే అధ్యక్షుడు, కార్యవర్గ ఎన్నిక నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా రాత్రి 10.30 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు సమయంలో అందిన సమాచారం మేరకు పటేల్‌ శ్రీశైలం ప్యానల్‌ ముందంజలో ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-12-28T05:21:06+05:30 IST