రేపటి నుంచి వీరభద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-03-16T06:13:55+05:30 IST

ఈ నెల 17 నుంచి 19వ తేదీ వ రకు మండలంలోని మాదాపురం గ్రామంలో వెలసిన త్రివేణి సంగమేశ్వర భద్రకాళి సమే త వీరభద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ని ర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ మంద సాయి లు తెలిపారు.

రేపటి నుంచి వీరభద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

 మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా పోస్టర్‌ ఆవిష్కరణ


కందుకూరు: ఈ నెల 17 నుంచి 19వ తేదీ వ రకు మండలంలోని మాదాపురం గ్రామంలో వెలసిన త్రివేణి సంగమేశ్వర భద్రకాళి సమే త వీరభద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ని ర్వహిస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ మంద సాయి లు తెలిపారు. ఆదివారం నగరంలోని విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి నివాసంలో బ్ర హ్మోత్సవాల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ ంగళవారం ఉదయం 6గంటలకు గంగ సేకరణ, గోపూజ, యాగశాల ప్రవేశం, గణపతి గౌరీపూజలతో ఉత్సవాలు ప్రారంభిస్తామన్నా రు. 18న మండపారధన, నవగ్రహ, వాస్తు మృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.


అదేరోజు సాయంత్రం 6గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహి స్తామన్నారు. 19న తెల్లవారు జామున 5 గం టలకు అగ్నిగుండ ప్రవేశం, ప్రతి రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలుంటాయన్నారు. బ్రహ్మోత్సవాలకు కేంద్ర హోం శాఖ సహా య మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి పి.సబితారెడ్డి, ఎంపీలు జి.రంజిత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అనీతారెడ్డి ము ఖ్య హాజరవుతారని తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివ స్తారన్నారు. కార్యక్రమంలో ఎలిమినేడ్‌ సర్పంచ్‌ అశోక్‌రెడ్డి, ఆలకమిటీ చైర్మన్‌ కర్ణాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ క్రి ష్ణాగౌడ్‌, వార్డు సభ్యులు సత్తిరెడ్డి, నారయ్య, బాలయ్య, రవిందర్‌చారి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T06:13:55+05:30 IST