స్ర్పే చేయరు...బ్లీచింగ్‌ పౌడర్‌ వేయరు

ABN , First Publish Date - 2020-04-05T09:47:50+05:30 IST

కరోనా వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని మునిసిపాలిటీల్లో బీచింగ్‌ పౌడర్‌ చల్లుతుంటే, రామయ్యగూడలో మాత్రం మునిసిపల్‌ అధికారులు బ్లీచింగ్‌ పౌడర్‌

స్ర్పే చేయరు...బ్లీచింగ్‌ పౌడర్‌ వేయరు

రామయ్యగూడ వార్డు పట్ల మునిసిపల్‌ అధికారుల వివక్ష


వికారాబాద్‌,(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని మునిసిపాలిటీల్లో బీచింగ్‌ పౌడర్‌ చల్లుతుంటే, రామయ్యగూడలో మాత్రం మునిసిపల్‌ అధికారులు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం లేదని ఆ వార్డు కౌన్సిలర్‌ రాయికల్‌ నర్సింహులు ఆరోపించారు. తనవార్డులో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలని పది రోజులుగా అధికారులను కోరుతుంటే  పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వారం రోజుల్లో తన వార్డులో ముగ్గురు మృతి చెందారన్నారు. కరోనా వ్యాప్తి జరుగుతున్న ఈ సమయంలో కూడా అధికారులు బ్లీచింగ్‌ పౌడర్‌ స్టాక్‌ లేదంటూ చేతులెత్తేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రామయ్యగూడలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లేలా కలెక్టర్‌ మునిసిపల్‌ అధికారులను ఆదేశించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-04-05T09:47:50+05:30 IST