-
-
Home » Telangana » Rangareddy » Uri vesukuni yuvakuni aatmahatya
-
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-11-25T05:46:58+05:30 IST
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

మర్పల్లి :మద్యం మత్తులో యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన కొత్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నవీన్ (21) వృత్తి రీత్యా సంగారెడ్డి జిల్లాలోని ఎంఆర్‌ఎఫ్ కంపెనీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. మద్యానికి బానిసై గతంలో రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ క్రమంలో సోమవారం మద్యంమత్తులో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
గుండంలో పడి యువతి..
యాలాల : జుంటుపల్లి రామస్వామి దేవాలయం గుండంలో పడి యువతి ఆత్మహత్య చేసుకుంది. బండమీదిపల్లి గ్రామానికి చెందిన ఉడుత అనంతప్పకూతురు భార్గవి(18), తాండూరులోని ప్రైవేట్ నర్సింగ్‌హోంలో నర్సుగా పనిచేస్తుంది. అయితే ఆదివారం ఉదయం భార్గవి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఆమె కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం జుంటుపల్లి రామస్వామిదేవాలయం గుండంలో యువతి శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అయితే భార్గవి మృతికి ఎలాంటి కారణాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.