అట్టహాసంగా యురేకా-2020

ABN , First Publish Date - 2020-12-21T04:27:09+05:30 IST

అట్టహాసంగా యురేకా-2020

అట్టహాసంగా యురేకా-2020
తలకొండపల్లి :విద్యార్థినికి బహుమతి ప్రదానం చేస్తున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

  • ఆకట్టుకున్న విద్యా, వైజ్ఞానిక  ప్రదర్శనలు 
  • కరోనా, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించిన విద్యార్థినులు
  • హాజరైన ఎమ్మెల్సీ కసిరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

తలకొండపల్లి/ఆమనగల్లు : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌ అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధన రంగాలపై విద్యార్థులు ప్రాథమిక దశనుంచే దృష్టి సారించాలని వారు కోరారు. తలకొండపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీస్‌ ఆధ్వర్యంలో మన ఊరికే..మన గురుకులంలో భాగంగా యూరేకా-2020 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమనగల్లు టీఎస్‌ డబ్య్లూఆర్‌ జేసీ (బాలికల) విద్యాలయం ఆధ్వర్యంలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించారు. కరోనా కారణంగా 9 నెలలుగా ఇంటి నుంచే టీ-శాట్‌, ఆన్‌లైన్‌ ద్వారా తరగతులువింటున్న విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని, వారి సృజనాత్మకతను వెలికి తీయడానికి నిర్వహించిన ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఆర్‌సీవో శారద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌, సర్పంచ్‌ లలితజ్యోతయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ రేణుకలతో కలిసి జడ్పీటీసీ వెంకటేశ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినులు పలు అంశాలపై ఇచ్చిన ప్రదర్శనలు  ఆకట్టుకున్నాయి. విద్యార్థులు మేథాశక్తిని, నైపుణ్యాన్ని చాటాయి. ప్రధానంగా కరోనా, మూఢనమ్మకాలపై ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాస రచన, ఉపన్యాస, స్పెల్‌ బీ, డ్రాయింగ్‌, యూత్‌ పార్లమెంట్‌ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో మరేరాష్ట్రంలో లేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందిస్తుందన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించాలని జడ్పీటీసీ వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మల కోరారు. కార్యక్రమంలో మిట్టపల్లి అంజయ్య, కృష్ణయ్య, నర్సింహ, జ్యోతయ్య, శ్రీశైలంగౌడ్‌, యాదయ్య, హేమరాజు, ఎస్‌ఐ వరప్రసాద్‌, జగదీశ్‌,మోహన్‌, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల పరిధిలోని పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆదివారం నగరంలోని తన నివాసంలో అందజేశారు. కార్యక్రమంలో పుట్ట రాంరెడ్డి, సాంబయ్యగౌడ్‌, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు, వెల్దండ, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ నగరంలోని తన నివాసంలో పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎంపీపీ శాంతి గోపాల్‌నాయక్‌, సర్పంచ్‌ రేవంత్‌రాజశేఖర్‌, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, గంప వెంకటేశ్‌, లాలయ్యగౌడ్‌, తోట గిరియాదవ్‌, నిట్ట నారాయణ, జైపాల్‌ రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు బీక్యానాయక్‌ మేనకోడలు రాజేశ్వరి రాజేశ్‌నాయక్‌ల వివాహ వేడుకలు కడ్తాల ఎమ్‌బీఏ గార్డెన్‌లో ఘనంగా జరిగాయి. నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్‌ బాలాజీసింగ్‌, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్‌, అనురాధపత్యనాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు బాచిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. 


విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ఇబ్రహీంపట్నం: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి చందు అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని సాంఘిక సంక్షేమ నల్లకంచె బాలికల గురుకుల పాఠశాలలో యురేకా-2020 మన ఊరికే.. మన గురుకులం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని వాటి సాధనకు నిరంతరం శ్రమించాలన్నార. విద్య, ఉద్యోగ రంగాల్లో బాలికలకు అపారమైన అవకాశాలున్నాయని వాటిని అందిపుచ్చుకుని తల్లిదండ్రులకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ లీలావతి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఎంపీపీ కృపేష్‌ అన్నారు. ఇబ్రహీంపట్నంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో యురేకా-2020 విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, సూపర్‌ స్టూడెంట్‌ క్విజ్‌, యూత్‌ పార్లమెంట్‌, పుస్తక సమీక్ష తదితర పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రఘునందన్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

కందుకూరు : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఆవరణలో మన ఊరికి.. మన గురుకులం కార్యక్రమంలో భాగంగా గురుకులం విద్యార్థులు పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ మందజ్యోతి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కరోనా కారణంగా పాఠశాల తెరవకపోయినా విద్యార్థులు చక్కటి ప్రదర్శన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణంరాజు, సర్పంచ్‌ శమంతకమణి, సీపీఐ నాయకుడు శంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి

షాద్‌నగర్‌రూరల్‌: విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసీ ప్రపంచానికి చాటాలని ఫరూఖ్‌నగర్‌ ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌ రాంరెడ్డి తెలిపారు. ఫరూఖ్‌నగర్‌ మండలంలోని కమ్మదనం గురుకుల పాఠశాల, షాద్‌నగర్‌ బాలికల పాఠశాలలో యురేకా-2020 కార్యక్రమ్నాన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన యూత్‌ పార్లమెంట్‌ అబ్బుర పరిచింది. వ్యాస రచన తదితర పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విద్యులత, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


క్రీడలతో స్నేహభావం..

మొయినాబాద్‌ రూరల్‌: క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని తెలంగాణ సాంఘిక సంక్షేమ చేవెళ్ల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి అన్నారు. మండలంలోని తోలుకట్ట గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాలలో యూరేకా-2020 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పోటీలను నిర్వి హంచారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌ముదిరాజ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-21T04:27:09+05:30 IST