శామీర్‌పేటలో మొదటిరోజు రెండు రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-11-03T09:53:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన ధరణి పోర్టర్‌ ద్వారా శామీర్‌పేట మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం మధ్యహ్నం 12 గంటలకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది

శామీర్‌పేటలో మొదటిరోజు రెండు రిజిస్ట్రేషన్లు

శామీర్‌పేట : రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన ధరణి పోర్టర్‌ ద్వారా శామీర్‌పేట మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం మధ్యహ్నం 12 గంటలకు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. లాల్‌గడి మలక్‌పేట రెవెన్యూ పరిధికి చెందిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు మీసేవ ద్వారా వేర్వేరుగా ఇద్దరు వ్యక్తులు బుక్‌ చేసుకున్న స్లాట్లు సోమవారం ధరణి పోర్టర్‌లో వెలువడింది. లాల్‌గడి మలక్‌పేట పరిధిలో వ్యవసాయ భూమి సర్వేనెంబర్‌- 336లోని 10 గుంటల భూమి యజమాని సాయిప్రియాంక అనే రైతు విక్రయించగా రఘుపతిరెడ్డి అనే రైతు కొనుగోలు చేశారు. అలాగే రెండో స్లాట్‌లో అదే లాల్‌గడి పరిధిలో సర్వేనెంబర్‌- 340లోని 12 గంటల వ్వవసాయ భూమిని యజమాని సాయిప్రియాంక విక్రయించగా దత్త ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన డైరెక్టర్‌ నాగప్రియాంక కొనుగోలు చేశారు. 


వీరికి తహసీల్దార్‌ సురేందర్‌ ధరణి ఈ పోర్టల్‌ ద్వారా ఒక్కో రిజిస్ర్టేషన్‌ను కేవలం 20 నిమిషాల్లో, రెండు రిజిస్ర్టేషన్లు 40 నిమిషాల్లోనే మ్యుటేషన్లతో  సహా ప్రక్రియను పూర్తి చేశారు. ఈ భూమి కొనుగోలుదారులు  రఘుపతిరెడ్డి, నాగప్రియాంకరెడ్డికి ఆర్డీవో రవి నమూనా ఈ పట్టాదార్‌ పాస్‌ బుక్‌ కాపీలను అందజేశారు. శామీర్‌పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా చేసిన వ్యవసాయ భూ రిజిస్ర్టేషను మేడ్చల్‌ జిల్లాలో మొదటిగా అధికారులు తెలిపారు. ధరణి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌రావు, ఆర్డీవో రవి పరిశీలించారు. తహసీల్దార్‌ సురేందర్‌ను, ఈ టెక్నీషియన్లను ఆర్డీవో రవి అభినందించారు.

Updated Date - 2020-11-03T09:53:21+05:30 IST