మేడ్చల్‌ జిల్లా పరిధిలో మరో 2 పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-05-13T05:30:56+05:30 IST

మేడ్చల్‌జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మేడ్చల్‌ జిల్లా పరిధిలో మరో 2 పాజిటివ్‌లు

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : మేడ్చల్‌జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అల్వాల్‌ మండలంలో ఒకటి. ఉప్పల్‌ మండలంలో మరొక కేసు నమోదైంది. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 88కు చేరింది. జిల్లాలోని .జీహెచ్‌ఎంసీ పరిధిలో 76పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో కోలుకుని ఇప్పటివరకు 33మంది డిశ్చార్జి అయ్యారు. 

Read more