వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-12-15T05:48:24+05:30 IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ముగ్గురికి తీవ్రగాయాలు  


మేడ్చల్‌/శామీర్‌పేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందిన సంఘటనలు మేడ్చల్‌, శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధి అత్వెల్లికి చెందిన  దుందిగల్ల నర్సింహ(14) అతని స్నేహితుడు బాబుతో కలిసి ద్విచక్రవాహనంపై టిఫిన్‌ కోసం మేడ్చల్‌ పట్టణానికి వస్తున్నాడు. మార్గ మధ్యలో జాతీయరహదారిపై ఐటీఐ యూ టర్న్‌ వద్ద డీసీఎంను దాటే క్రమంలో పక్క నుంచి లారీ కంటేనర్‌  రావడంతో నర్సింహ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో నర్సింహ తలపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా బాబుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శామీర్‌పేటలో ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాజీవ్‌ రహదారిలో అలియాబాద్‌ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. నగరంలోని బేగంబజార్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌గోపాల్‌,  ప్రథం తివారి అనే విద్యార్థులు సోమవారం ఉదయం బేగంబజార్‌ నుంచి బైక్‌పై బయలుదేరి రాజీవ్‌ రహదారిలో కొండపోచమ్మ ప్రాంతానికి వెళ్తున్నారు. అదే మార్గంలో శామీర్‌పేట మండలం అలియాబాద్‌ చౌరస్తా వద్ద అలియాబాద్‌ గ్రామానికి చెందిన బల్‌రామ్‌(38) తన బైక్‌పై శామీర్‌పేట నుంచి అలియాబాద్‌ వైపునకు వెళ్తున్నాడు. కాగా రాజ్‌గోపాల్‌, తివారిలు వారి బైక్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ  ప్రమాదవశాత్తు బాల్‌రామ్‌ బైక్‌ను ఢీకొట్టారు. ఈప్రమాదంలో బల్‌రామ్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.  బైక్‌ నడుపుతున్న తివారితో పాటు రాజ్‌గోపాల్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బల్‌రామ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తివారి, రాజ్‌గోపాల్‌లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-15T05:48:24+05:30 IST