సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే పట్టం

ABN , First Publish Date - 2020-02-16T09:18:43+05:30 IST

సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే పట్టం

సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే పట్టం

  • ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి 


కొడంగల్‌: ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఐబీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కొడంగల్‌, కోస్గి, మద్దూర్‌, దౌల్తాబాద్‌, బొంరా్‌సపేట్‌ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగించడం సంతోషదాయకం అన్నారు.   నియోజకవర్గంలోని 5 సహకార సంఘాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.   మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప, పార్టీ నాయకులు మధుసూదన్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-16T09:18:43+05:30 IST