టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు

ABN , First Publish Date - 2020-12-05T05:46:52+05:30 IST

టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు

టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు
శామీర్‌పేటలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న అఫ్జల్‌ఖాన్‌

మేడ్చల్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం నిర్వహించిన డివిజన్‌లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు గెలుపొందడంతో శుక్రవారం సంబురాలు నిర్వహించారు. కుత్భుల్లాపూర్‌లోని పలు డివిజన్‌లలో మేడ్చల్‌ టీఆర్‌ఎస్‌ నేతలు పది రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధుల గెలుపుతో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి, బాణసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సొసైటీ చైర్మన్‌ రణదీప్‌రెడ్డి, మునీరాబాద్‌ సర్పంచ్‌ గణేష్‌, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మేడ్చల్‌ మున్సిపల్‌ నేతలు శేఖర్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, శైలేందర్‌ , మోహన్‌రెడ్డి, కౌన్సిలర్‌ గణేష్‌ తదితరులు గెలుపొందిన అభ్యర్థులతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు. 


కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం


శామీర్‌పేట: తాను ముందే చెప్పినట్లుగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ పతాకం ఎగురవేసిందని కేసీఆర్‌ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ కార్పొరేటర్లు విజయం సాధించగా శుక్రవారం సీఎం కేసిఆర్‌ చిత్రపటానికి అఫ్జల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు.  అఫ్జల్‌ఖాన్‌ మాట్లాడుతూ ఎన్నికలు ఏవొచ్చినా కేసీఆర్‌ అభివృద్ధి చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీనే గెలిపించారన్నారు. ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు వినే అవకాశం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీకాంత్‌, నర్సింహారెడ్డి, మేడి భాస్కర్‌, రమేష్‌, నిసార్‌ అహ్మద్‌ఖాన్‌, పవన్‌ ముదిరాజ్‌, నవీన్‌ముదిరాజ్‌, కుమార్‌, యాదగిరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T05:46:52+05:30 IST