ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ABN , First Publish Date - 2020-09-12T10:04:00+05:30 IST
పూడూరు మండలం కంకల్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న సత్యనారాయణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ..

పరిగి/నవాబుపేట/మోమిన్‌పేట/యాలాల/బొంరాస్‌పేట్: పూడూరు మండలం కంకల్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న సత్యనారాయణ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సందర్భంగా శుక్రవారం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎంపీపీ మల్లేశం, సంఘం నేతలు ఉత్తమ టీచర్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అమర్‌నాథ్, కళ్యాణి, అంజిలయ్య, జహంగీర్‌లు పాల్గొన్నారు. నవాబుపేట మండలంలోని కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయురాలు నాంచేరి ఇందిర జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని ఎంఈవో గోపాల్ అన్నారు.
శుక్రవారం కేజీబీవీ పాఠశాల ఆవరణలో ఆమెను పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆశలత, పాండు పాల్గొన్నారు. మోమిన్‌పేట మండల పరిధి మేకవనంపల్లి జిల్లా పరిషత్ ఉపాధ్యాయుడు చిగుళ్లపల్లి వేణుగోపాల్ (ఎస్‌ఏ-గణితం) జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో మండల విద్యాధికారి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య, మోహన్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందంతో కలిసి ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
యాలాలలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆర్.కృష్ణయ్య జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. ఎంఈవో శుక్రవారం కృష్ణయ్యను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. బొంరా్‌సపేట్‌లోని చౌదర్‌పల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పల్లెగడ్డ వెంకటయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవడంతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాంరెడ్డి, అనిల్‌కుమార్, చంద్రశేఖర్, వెంకటేశ్, మల్లికార్జున్, మల్లేశం, గౌరారంగోపాల్, రవీందర్‌గౌడ్, శ్రీహరిరెడ్డి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.