అమరవీరులకు నివాళి
ABN , First Publish Date - 2020-03-02T10:45:34+05:30 IST
మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరువీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్

తలకొండపల్లి: మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరువీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్గీకరణ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామచంద్రయ్య, శంకర్, కృష్ణ, కుమార్, రాజు, పాండు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.