2.40 లక్షల మొక్కల పెంపకం

ABN , First Publish Date - 2020-12-06T04:58:57+05:30 IST

2.40 లక్షల మొక్కల పెంపకం

2.40 లక్షల మొక్కల పెంపకం

కడ్తాల్‌ : ఏడో విడత హరితహారంలో భాగంగా మండలంలో 2.40 లక్షల మొక్కలు పెంచుతున్నట్లు ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిదిలో 10 వేల చొప్పున మొక్కల పెంపకానికి నర్సరీలు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మండలంలోని నార్లకుంటతండాలో నర్సరీని శనివారం సందర్శించారు. ఎంపీవో తేజ్‌సింగ్‌, సర్పంచ్‌ పూజదేవ్‌సింగ్‌లతో కలిసి మొక్కల పెంపకానికి సిద్ధం చేసిన కవర్లను పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి అన్ని నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రాములునాయక్‌, పంచాయతీ కార్యదర్శి మహేశ్‌, రూప్‌సింగ్‌, రాములు, భాస్కర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T04:58:57+05:30 IST