ముగిసిన సీబీఆర్‌ఎన్‌ శిక్షణ

ABN , First Publish Date - 2020-12-12T04:57:36+05:30 IST

ముగిసిన సీబీఆర్‌ఎన్‌ శిక్షణ

ముగిసిన సీబీఆర్‌ఎన్‌ శిక్షణ

శంషాబాద్‌రూరల్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రసాయన, జీవ, రేడియోలాజికల్‌, అణు పదార్ధాలు (సీబీఆర్‌ఎన్‌)శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్క్యూ అండ్‌ ఫైర్‌  ఫైటింగ్‌ (ఏఆర్‌ఎ్‌ఫఎఫ్‌) సిబ్బందికి  రసాయన, ఉగ్రవాదుల దాడులు, ఎమర్జెన్సీ పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలనే  అంశాలపై జాతీయ విపత్తుల నిర్వహణ అఽథారిటీ (ఎన్‌డీఎంఏ) అధికారులు  శిక్షణ ఇచ్చారు.  శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత అత్యంత ముఖ్యమైందని దీని కోసం ఏఆర్‌ఎ్‌ఫఎఫ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణతో పాటు వ్యక్తిగత రక్షణ పీపీఈ కిట్ల వాడకం, ప్రమాదకర  వస్తువులను గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేయడం  గురించి ఎన్‌డీఎంఏ అదనపు కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ వివరించారని చెప్పారు. గత ఆరు నెలల్లో అనేక మంది సిబ్బంది రసాయనిక ప్రమాదాలు జరిగి గాయపడ్డారని, ముందు జాగ్రత్త చర్యగా ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

Updated Date - 2020-12-12T04:57:36+05:30 IST