ఇది పొలం కాదు.. మరేంటనుకుంటున్నారా..?
ABN , First Publish Date - 2020-08-11T16:23:02+05:30 IST
ఈ ఫొటో చూస్తుంటే ఏమనిపిస్తుంది. పొలంలో కొందరు కూలీలు కలుపు తీస్తున్నట్టుగా ఉంది కదా.. కానీ అది పొలం కాదు. అందులో పనిచేసేవారు కూలీలూ కాదు.

ఈ ఫొటో చూస్తుంటే ఏమనిపిస్తుంది. పొలంలో కొందరు కూలీలు కలుపు తీస్తున్నట్టుగా ఉంది కదా.. కానీ అది పొలం కాదు. అందులో పనిచేసేవారు కూలీలూ కాదు. అది సాక్షాత్తూ మేడ్చల్ మండలం మునీరాబాద్‌లోని విద్యార్థులు చదువుకునే పాఠశాల ప్రాంగణం. మార్చి నుంచి ఇప్పటివరకు పాఠశాలలు నడవకపోవడంతో అక్కడ భారీగా పిచ్చి మొక్కలు మొలిచాయి. దీంతో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ మొక్కలను తొలగిస్తున్నారు. శ్రమదానంలో సర్పంచ్ గణేష్, ఉపసర్పంచ్ నర్సింగ్‌రావు, పంచాయతీ కార్యదర్శి మల్లారెడ్డి, వార్డుసభ్యులు నరేందర్, రమేష్, నాగరాజురెడ్డి, వెంకట్, శ్రీనివాస్‌రెడ్డి, దేవి పాల్గొన్నారు.
- మేడ్చల్