ఇద్దరు దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-12-04T05:06:49+05:30 IST

ఇద్దరు దొంగల అరెస్ట్‌

ఇద్దరు దొంగల అరెస్ట్‌
చోరీ వివరాలను వెల్లడిస్తున్న ఏసీపీ సురేందర్‌

షాద్‌నగర్‌ రూరల్‌: తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని షాద్‌నగర్‌ పట్టణం, ఉమ్మడి జిల్లాలో చోరీలకు పాల్పడిన పాత నేరస్థులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీల వివరాలను వెల్లడించారు. కర్నూలు జిల్లా కొల్లూరు మండలం పార్ల గ్రామానికి చెందిన గార్లపాటి నాగరాజు ప్రస్తుతం షాద్‌నగర్‌లోని ఇందిరానగర్‌లో నివాసముంటున్నాడు. ఇందిరానగర్‌ కాలనీకే చెందిన ఎనుముల(మొండి) బాలయ్యతో జతకట్టి షాద్‌నగర్‌లో 9ఇళ్లలో, గద్వాల, కొత్తకోటలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్టు తెలిపారు. షాద్‌నగర్‌లో వారు సంచరిస్తుండగా గురువారం పట్టుకున్నట్టు వివరించారు. వారి వద్ద రెండు తులాల బంగారం, 5తులాల వెండి వస్తువులు, రూ.15వేలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ వస్తువుల విలువ రూ.లక్షకుపైగా ఉంటుందన్నారు. సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌కుమార్‌, ఎస్సైలు విజయబాస్కర్‌, వెంకటేశ్వర్లు ఉన్నారు.

Updated Date - 2020-12-04T05:06:49+05:30 IST